
కామెడీ వెబ్ సిరీస్‌లలో ‘పంచాయత్’ ఫ్రాంచైజీకు అంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. ఓటీటీ కంటెంట్ అంటే క్రైమ్, అడల్ట్ సీన్స్ కంపల్సరీ అని భావిస్తున్న సమయంలో వాటన్నింటికీ భిన్నంగా సింపుల్‌స్టోరీతో ఫ్యామిలీ అంతా కలిసి చూస్తూ హాయిగా నవ్వుకునేలా చేసింది ‘పంచాయత్’ సిరీస్. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో మూడు భాగాలు రావడంతో పాటు తెలుగులో ‘సివరపల్లి’ పేరుతో రీమేక్ అయింది. ఇప్పుడిక ఈ వెబ్ సిరీస్ మేకర్స్ నుంచి ‘గ్రామ్ చికిత్సాలయ్’ అనే మరో సిరీస్ వస్తోంది.
‘పంచాయత్’ తెరకెక్కించిన దీపక్ కుమార్ మిశ్రా క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా రాహుల్ పాండే దర్శకుడు. ఆదర్శ భావాలున్న డా.ప్రభాత్ అనే సిటీ డాక్టర్ మారుమూల గ్రామంలోని గవర్నమెంట్ హెల్త్ సెంటర్‌కు వచ్చి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేది కాన్సెప్ట్. అమోల్ పరాశర్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా వినయ్ పాఠక్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
సోషల్ ఇష్యూస్‌కు ఫన్ బ్లెండ్ చేసిన రూరల్ కామెడీ డ్రామా ఇది. ‘పంచాయత్’ తరహాలోనే మారుమూల గ్రామం, అక్కడి మనుషులు, సున్నితమైన హాస్యంతో ఇది ఉండబోతోందని పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ కానుంది.