
హైదరాబాద్, వెలుగు: గత నెల 27న మొదలైన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌కు అద్భుత ఆదరణ వస్తోందని అమెజాన్ తెలిపింది. మొదటి 48 గంటల్లోనే సుమారు 11 కోట్ల మంది అమెజాన్సైట్, యాప్‌ను సందర్శించారు. ఎనిమిది వేల మంది రూ.లక్ష విలువైన షాపింగ్ చేశారు. ల్యాప్ టాప్స్, టీవీలు, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ డెకార్, ఉపకరణాలు, గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్లు, కిరాణా సరుకులు వంటి సెగ్మెంట్లలో 25 వేలకు పైగా కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామని అమెజాన్ ప్రకటించింది. ఎక్స్ఛేంజ్, ఈఎంఐ, బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌కౌంట్లు, రివార్డ్స్, ఇంటి వద్ద ఇన్‌స్టలేషన్ వంటి సదుపాయాలు అందిస్తున్నామని పేర్కొంది.