హైదరాబాద్, వెలుగు: తమ ప్రైమ్మెంబర్లకు వస్తువులు ఆర్డర్ ఇచ్చిన రోజు లేదా మరునాడు డెలివరీ చేస్తున్నామని ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రకటించింది. ప్రతి రోజూ 10 లక్షలకు పైగా వస్తువులను అదేరోజు, 40 లక్షలకు పైగా వస్తువులను మరుసటి రోజు డెలివరీ చేస్తున్నామని తెలిపింది. పర్యావరణానికి అనుకూలమైన విధానాల్లో డెలివరీలు ఇస్తున్నామని అమెజాన్తెలిపింది.