అమెజాన్..ఆన్ లైన్ మార్కెటింగ్ దిగ్గజం. అంతేకాదు.. అమెజాన్ ప్రైమ్ తో యూజర్లనూ ఎంటర్‌టైన్ చేస్తోంది. తాజాగా మరో కొత్త వెంచర్‌లోకి అమెజాన్ అడుగుపెడుతోంది. ప్రస్తుతం బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ రంగంలో మంచి డిమాండ్ ఉన్న SpaceX స్టార్‌లింక్ కు పోటీగా దిగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 95 శాతం మంది జనాభాకు బ్రాడ్ బ్యాండ్ఇంటర్నెట్ అందించేలా.. లో ఎర్త్ ఆర్బిట్‌లో 3,236శాటిలైట్లను లాంచ్ చేయబోతోంది. బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించేందుకు ‘లో ఎర్త్ ఆర్బిట్’ లోకి శాటిలైట్లను ఇవాళ (అక్టోబర్ 6) అంతరిక్షంలోకి ప్రవేశపెడుతోంది. ఈ శాటిలైట్లను ఎక్కడైతే బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ సరిగ్గా ఉండదో ఈ ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచేందుకు వాడనుంది.
SpaceX స్టార్‌లింక్‌తో పోటీగా బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ అందించేందుకు అమెజాన్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతోంది. కైపర్ ప్రాజెక్టులో భాగంగా రెండు ఫ్రొటోటైప్ శాటిలైట్స్ కైపర్ శాట్ 1, కైపర్ శాట్ 2ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. శుక్రవారం (అక్టోబర్ 6) మధ్యాహ్నం 2గంటలకు ఫ్లోరిడాలోని యునైటెడ్ లాంచ్ అలయన్స్ అట్లాస్ V వర్క్‌హోర్స్ రాకెట్‌లో ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడతారు. అమెజాన్ ప్లాన్ ప్రకారం కూపర్ ప్రాజెక్ట కింద లాం చ్ చేయబోతోన్న 3,236 శాటిలైట్లలో..784 శాటిలైట్లను 367 మైళ్ల ఎత్తులో, 1296 శాటి-లైట్లను 379 మైళ్ల ఎత్తులో, 1,156 శాటిలైట్లను 391మైళ్ల ఎత్తులో ఏర్పాటు చేయనుంది.