హైదరాబాద్, వెలుగు: ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రోగ్రామ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 50 వేలకుపైగా కంటెంట్ క్రియేటర్లతో కలిసి పనిచేస్తున్నట్టు ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రకటించింది. వీరిలో 10 శాతానికి పైగా తెలంగాణవారని సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తోట కిషోర్ తెలిపారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రియేటర్లు, సెల్లర్లు.. కస్టమర్లకు సహకరించేందుకు లైవ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రైమ్ డే 2024 కోసం వందలాది మంది క్రియేటర్‌లు మొబైల్‌లు, ఫ్యాషన్, బ్యూటీ వంటి అనేక ఇతర విభాగాల్లో 300కి పైగా లైవ్ప్రసారాలు అందిస్తారని చెప్పారు. ప్రైమ్డేను ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా 450 బ్రాండ్లు తమ ప్రొడక్టులను లాంచ్ చేస్తాయని తెలియజేశారు. ఎస్బీఐ, ఐసీఐసీఐ కార్డులతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తామన్నారు. తమ సెల్లర్ల సంఖ్య 14 లక్షలకు చేరిందని, వీరిలో 50 వేల మంది తెలంగాణవారని కిషోర్ వివరించారు.