
హైదరాబాద్, వెలుగు: వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ–కామర్స్ ప్లాట్ఫామ్అమెజాన్ ప్యార్బజార్ పేరుతో స్పెషల్ స్టోర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫ్యాషన్, గృహాలంకరణ, వంటగది ఉత్పత్తులు, ఫోన్ యాక్సెసరీలపై భారీ తగ్గింపులు ఇస్తారు. ఆభరణాలపైనా ఆఫర్లు ఉన్నాయి.
ధరలు కేవలం రూ. 99 నుంచి మొదలవుతాయి. ఫ్రీ డెలివరీ, క్యాష్ ఆన్డెలివరీ, ఇబ్బందులు లేని ఐదు -రోజుల రిటర్న్స్వంటి సౌకర్యాలను పొందవచ్చు. యూఐపీ విధానంలో చెల్లింపుల పై అదనంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా పొందవచ్చని అమెజాన్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్జహీద్ ఖాన్ అన్నారు.