హైదరాబాద్​లో డేటా సెంటర్లు.. 2030 నాటికి 30 వేల కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్​లో డేటా సెంటర్లు.. 2030 నాటికి 30 వేల కోట్ల పెట్టుబడులు
  • 48 వేల ఫుల్ టైమ్ జాబ్స్
  • అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ సమీపంలో రెండో డేటా సెంటర్​ క్లస్టర్​ ఏర్పాటు చేయనున్నట్లు అమెజాన్ వెబ్​ సర్వీసెస్​ ​ ప్రకటించింది. ఈ డేటా సెంటర్​ క్లస్టర్​ ఏర్పాటు కోసం 2030 నాటికి రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ముంబైలో ఇప్పటికే ఒక డేటా సెంటర్​ను అమెజాన్​ వెబ్​సర్వీసెస్​2016 లో ఏర్పాటు చేసింది. ప్రపంచంలో మొత్తం 30 చోట్ల డేటా సెంటర్​ క్లస్టర్లను అమెజాన్​ వెబ్​ సర్వీసెస్​ నెలకొల్పింది. ఈ పెట్టుబడుల ఫలితంగా 48 వేల ఫుల్​టైమ్​ జాబ్స్​ క్రియేట్​ అవుతాయని అమెజాన్​వెబ్​ సర్వీసెస్​ ఈ ప్రకటనలో తెలిపింది. అమెజాన్​ వెబ్​ సర్వీసెస్​ డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల దేశపు జీడీపీకి రూ. 63,600 కోట్లు యాడ్​ అవుతుందని తెలంగాణ ఐటీ మంత్రి కే టీ రామారావు ఈ సందర్భంగా చెప్పారు.

డేటా సెంటర్ల జోరు....

డెవలపర్లు, స్టార్టప్స్​, కంపెనీలు తమ వర్క్​లోడ్స్​ను మరింత సమర్ధంగా నడుపుకునేలా, ఇండియాలోనే డేటాను భద్రంగా దాచుకునేలా ఈ కొత్త డేటా సెంటర్​ క్లస్టర్ వీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా అమెజాన్​.కామ్​ ఇంక్​ కంపెనీ అమెజాన్​ వెబ్​ సర్వీసెస్​ ప్రకటించింది. దీంతోపాటు ఎండ్​ యూజర్లకు లేటెన్సీ మరింత తగ్గుతుందని వివరించింది. దేశంలో డేటా వినియోగం భారీగా పెరగడంతోపాటు, క్లౌడ్​ జోరందుకోవడంతో డేటా సెంటర్ల ఆవశ్యకత ఎక్కువైంది. ఇండియాలో డేటా సెంటర్స్​ కెపాసిటీ 2025 నాటికి రెట్టింపయి 1700–1800 ఎండబ్ల్యూకి చేరుతుందని రేటింగ్​ ఏజన్సీ క్రిసిల్​ అంచనా వేస్తోంది. ఈ కెపాసిటీ ప్రస్తుతం 870 ఎండబ్ల్యూ. ఈ నేపథ్యంలోనే అదానీ లాంటి పెద్ద గ్రూపులు కూడా డేటా సెంటర్స్​ బిజినెస్​పై ఆసక్తి చూపిస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలలో డేటా సెంటర్లు పెట్టనున్నట్లు ఈ గ్రూప్ ప్రకటించింది. జెన్​2 క్లౌడ్​ సెంటర్లను ముంబై, హైదరాబాద్​లలో ఏర్పాటు చేస్తామని ఒరాకిల్​ 2019 లోనే వెల్లడించింది. స్మాల్​ అండ్​ మీడియం ఎంటర్​ప్రైజస్​కు క్లౌడ్​ సేవలందించేందుకు మైక్రోసాఫ్ట్​తో కలిసి డేటా సెంటర్లు పెట్టనున్నట్లు రిలయన్స్​ ఇండస్ట్రీస్​ తెలిపింది. ముంబై, చెన్నైలలో డేటా సెంటర్ల ఏర్పాటు కోఐసం యోటా ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను హీరానందాని గ్రూప్​ తెచ్చింది. 

లేటెస్ట్​ టెక్నాలజీలు....

ఏడబ్ల్యూఎస్​ రెండో డేటా సెంటర్​ ఏర్పాటుతో డెవలపర్లు, స్టార్టప్స్​, ఎంట్రప్రెనూర్లు, ఎంటర్​ప్రైజస్​, గవర్నమెంట్​, ఎడ్యుకేషన్​, ఎన్​జీఓలు వంటి వాటికి తమ అప్లికేషన్లను రన్​ చేసుకోవడంలో ఛాయిస్​ పెరుగుతుందని అమెజాన్​ వెల్లడించింది. ఏడబ్ల్యూఎస్​ అడ్వాన్స్​డ్​ టెక్నాలజీలు ఇప్పుడు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని,  ఇందులో  డేటా ఎనలిటిక్స్​, సెక్యూరిటీ, మెషిన్​ లెర్నింగ్​, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) వంటివి భాగమని పేర్కొంది. ఇండియా డిజిటల్​ ట్రాన్స్​ఫార్మేషన్​కు ఈ ప్రాజెక్టు మద్దతు ఇస్తుంది. ప్రధాని మోడీ ట్రిలియన్​ డాలర్ల డిజిటల్​ ఎకానమీ విజన్​ దేశంలో క్లౌడ్​ భారీగా విస్తరించడానికి వీలు కల్పిస్తోంది. డిజిటల్​ ఎకో సిస్టమ్​లో డేటా సెంటర్లు కీలకపాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్​ పేర్కొన్నారు. దేశంలోని డేటా సెంటర్ల కెపాసిటీని 2,565 ఎండబ్ల్యూకి పెంచేందుకు కొత క్లవుడ్​ అండ్​ డేటా సెంటర్​ పాలసీ సాయపడుతుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు.