అమెజాన్ లైవ్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్ Twitch 500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్దంగా ఉందని తాజా నివేదికలు చెపుతున్నాయి. కంపెనీ ఉద్యోగుల్లో 35 శాతం మందిని తొలంగించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళో రేపు ఈ లేఆఫ్ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ ఇబ్బందులతో 2023లో 400 మంది ఎంప్లాయిస్ ని అమెజాన్ Twitch తొలగించింది.
అమెజాన్ ఆధ్వర్యంలో నడుస్తు్న్న లైవ్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్ Twitch ..తొమ్మిదేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చాలాకాలంగా నష్టాల్లో సాగుతోంది. 1.8 బిలియన్ గంటల లైవ్ కంటెంట్ కు కలిగి ఉన్న ఈ ఫ్లాట్ ఫారమ్ నిర్వహణ భారం అయిందని అదికారులు గుర్తించారు.
ఆర్థిక నష్టాలను పరిష్కరించేందుకు ఆన్ లైన్ స్ట్రీమింగ్ పరిశ్రమలో వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయి. దీనికి అనుగుణంగా కంపెనీ ఉద్యోగుల తొలగింపులు చేపడుతోందని తాజా నివేదికలు చెపుతున్నాయి.
కొన్ని దేశాల్లో కార్యాలయాలు మూసివేశారు కూడా. సంస్థ అంతర్గత నిర్మాణం, ప్రస్తుత మార్కెట్ తో పోటీ పడేందేకు అమెజాన్ Twitch చర్యల్లో భాగంగానే లేఅఫ్స్ చేపట్టిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.