
మెదక్, వెలుగు: మెదక్ కొత్త ఆర్డీఓగా అంబదాస్ రాజేశ్వర్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన సాయిరాం ట్రాన్స్ఫర్ కాగా ఆయన స్థానంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో పనిచేస్తున్న రాజేశ్వర్‌ను మెదక్ ఆర్డీఓగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఈఓ సార శ్రీనివాస్ ఆయను ఆలయ మర్యాదలతో సన్మానించారు.
ఖేడ్ ఆర్డీవోగా పాండునారాయణ్ ఖేడ్, వెలుగు : అందోల్ ఆర్డీఓగా పనిచేసిన పాండును నారాయణఖేడ్ ఇన్చార్జి ఆర్డీవోగా ప్రభుత్వం నియమించింది. నారాయణఖేడ్ లో నాలుగేండ్ల నుంచి ఆర్డీఓగా పని చేసిన అంబదాస్ రాజేశ్వర్ మెదక్ ఆర్డీఓగా బదిలీ అయ్యారు. కాగా అచ్చంపేటలో విధులు నిర్వహిస్తున్న పాండును అందోల్ ఆర్డీఓగా నియమించి నారాయణఖేడ్ ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పారు.