Ambajipeta marriage band OTT: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు OTT డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Ambajipeta marriage band OTT: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు OTT డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నటుడు సుహాస్(Suhas) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు(Ambajipeta marriage band). కొత్త దర్శకుడు దుశ్యంత్ కటికినేని(Dushyanth Katikineni) తెరకెక్కించిన ఈ సినిమాలో శివాని నాగారం(Shivani Nagaram) హీరోయిన్ గా నటించగా.. శరణ్య ప్రదీప్(Sharanya Pradeep) కీ రోల్ లో కనిపించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ లోకి వచ్చింది. రూరల్ అండ్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. దీంతో కలెక్షన్స్ కూడా అదే లెవల్లో రాబట్టింది ఈ మూవీ.

కేవలం రూ. 3 కోట్ల బ్రేకీవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. మూడురోజుల్లోనే రూ.8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మేకర్స్ కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక సినిమా విడుదలై నెలరోజులు కావస్తుండటంతో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు మూవీ OTT రిలీజ్ గురించి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై అధికారిక ప్రకటన ఇచ్చేశారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్న ఆహా సంస్థ మార్చ్ 1 నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.