అంబానీ ఫ్యామిలీ గురించి తెలియని వారెవరుంటారు.. అంత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకరైన అంబానీల విలాసవంతమైన జీవన శైలి, వారు నిర్వహించే వేడుకలు చాలా ప్రసిద్ది.. ఇది మనం తరుచుగా చూస్తున్న, వింటున్న విషయమే. వారి విలాసవంతమైన పార్టీలు, రిచ్ మ్యారేజ్ ఫంక్షన్లు..ఎప్పుడూ గుర్తుండిపోయేలా ఈవెంట్స్ నిర్వహస్తుంటారు. ఈసారి ముఖేష్ అంబానీ తన కుమా రుడు అనంత్ అంబానీ, అతని కాబోయే భార్య రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా ముంబై సమీపంలో థానేలో అంబానీ కుటుంబం సామూహిక వివాహాలను జరిపించారు. హిందూ సాంప్రదాయ పద్దతిలో అనేక జంటలను ఒక్కటి చేశారు. అంబానీలు.. ఈ కొత్త జంటలకు పైసా ఖర్చు లేకుండా అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. ఈవెంట్ ఆర్గనైజర్లను పెట్టి మరీ ఎల్లకాలం గుర్తిండిపోయేలా ఈ జంటలకు పెళ్లి చేశారు.
అయితే ఈ మాస్ వెడ్డింగ్ వెనక ఉన్న ఆలోచన ఏంటంటే..నిరుపేద జంటలకు ఎల్లకాలం గుర్తిండిపోయేలా కలల వివాహం జరిపించడం.అంబానీ కుటుంబం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారి పెద్ద మనుసును చాటుకుంటుంది. ఇది వారు సమాజామనికి తిరిగి ఇవ్వాలనే నిబద్ధత ను తెలియజేస్తుందంటున్నారు ఈ మాస్ ఈవెంట్ చూసినవారు.