శాంతి భద్రతల పరిరక్షణకు కృషి : సీపీ అంబర్ కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా 

శాంతి భద్రతల పరిరక్షణకు కృషి : సీపీ అంబర్ కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా 
  • రామగుండం సీపీగా అంబర్​కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా బాధ్యతలు 

గోదావరిఖని, వెలుగు: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని రామగుండం సీపీ అంబర్ కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా అన్నారు. సోమవారం సీపీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీపీకి అడిషనల్​డీసీపీ(అడ్మిన్​) సి.రాజు, డీసీపీలు ఎ.భాస్కర్, కరుణాకర్​, కమిషనరేట్ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్ప్రవర్తన, మంచి నడవడిక కలిగిన వారికి, ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతోపాటు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేవారు, రౌడీ షీటర్లు, భూ కబ్జాలకు పాల్పడే వారి పట్ల పోలీస్​ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.

కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు 24 గంటల పాటు పనిచేస్తామన్నారు. నేరాల నియంత్రణకు టెక్నాలజీని ఉపయోగిస్తామని, ల్యాండ్ మాఫియా, డ్రగ్స్, గంజాయి రవాణా పట్ల ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. కాగా పూర్వ సీపీ ఎం.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోలీస్ అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.

బాధ్యతలు స్వీకరించిన సీపీ గౌస్ ఆలం

కరీంనగర్ టౌన్,వెలుగు:  కరీంనగర్ పోలీస్ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా గౌస్ ఆలం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌‌‌‌లోని కలెక్టర్ పమేలాసత్పతి చాంబర్‌‌‌‌‌‌‌‌లో ఆమెను  మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు.