చంద్రబాబు బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారు: అంబటి రాంబాబు

చంద్రబాబు బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారు: అంబటి రాంబాబు

ఏపీలో రేషన్ బియ్యం ఎగుమతుల వ్యవహారం అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య రచ్చకు దారి తీసింది.  తాజాగా ప్రభుత్వం ఈ అంశంపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మాజీ అంబటి రాంబాబు ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారని.. ప్రభుత్వం ఎన్ని సిట్ లు ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు అంబటి. ఇప్పటికే తిరుమల లడ్డుపై, గంజాయిపై సిట్ లు ఏర్పాటు చేశారని.. ఇప్పుడు రేషన్ బియ్యంపై మరో సిట్ ఏర్పాటు చేశారని.. ఇవన్నీ ప్రచారం కోసమే తప్ప చేసేదేమీ లేదని అన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే ఇదంతా నడుస్తోందని.. నడిచినంత కాలం నడుస్తుందని ఎద్దేవా చేశారు అంబటి.

ఎన్నికల్లో సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా హామీలిచ్చారని.. ఇప్పుడు హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని అన్నారు. వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు అంబటి. ఈ ప్రయత్నాల్లో భాగమే మొన్న తిరుమల లడ్డు, ఇప్పుడు కాకినాడ పోర్టు కొనుగోలు ఒప్పందంపై చేస్తున్నారని అన్నారు.