ఎవరైనా జగన్ ను ఫాలో కావాల్సిందే.. అంబటి రాంబాబు

ఏపీలో భూ రీసర్వేపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎన్నికలకు ముందు భూ రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములను దోచుకుంటాడంటూ ప్రచారం చేసింది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. అయితే, అధికారంలోకి వచ్చాక భూ రీసర్వేకి సన్నాహాలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. దీనిపై ప్రతిపక్ష వైసీపీ విమర్శలు మొదలు పెట్టింది. ఎన్నికల్లో దుష్ప్రచారం చేసి ఇప్పుడు యు టర్న్ తీసుకున్నారంటూ ఆరోపిస్తోంది వైసీపీ. ఈ క్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి గొప్ప చట్టం రద్దు చేసామని చెబుతున్నాడు గానీ.. చివరికి దాని పేరు మార్చి మళ్ళీ అమలు చేస్తాడని అన్నారు.ఇప్పటికే జగన్ హయాంలో  రాష్ట్ర వ్యాప్తంగా 6వేల గ్రామాల్లో భూ రీసర్వే చేయటం జరిగిందని అన్నారు. ఎవరైనా జగన్ ను ఫాలో అవ్వాల్సిందేనని అన్నారు.యూటర్న్‌లో చంద్రబాబుది గిన్నిస్‌ రికార్డని ఎద్దేవా చేశారు.ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒక మాట చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.మేనిఫెస్టోలో పెట్టిన  హామీలు ఎగ్గొట్టడం కోసం సాకులు చెబుతున్నాడని అన్నారు అంబటి.