పోలీసులపై సిట్ కు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. 

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘర్షణలు తీవ్ర కలకలం రేపాయి. ఈ అల్లర్లను సీరియస్ గా తీసుకున్న ఈసీ సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో పల్నాడు జిల్లా పోలీసులపై మంత్రి అంబటి రాంబాబు సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు.  ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో పొలిసు వ్యవస్థ దారుణంగా విఫలమయ్యారని అన్నారు. ఘర్షణల కారణంగా తొండపి అనే గ్రామంలో ఊరు ఊరంతా వలస వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకొని గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలని కోరారు.

సిట్ విచారణలో పోలీసులే దోషులుగా తేలుతారని, క్షేత్రస్థాయిలో పోలీసుల పాత్రపై దర్యాప్తు చేయాలని అన్నారు అంబటి. టీడీపీ నేతల నుండి డబ్బులు తీసుకొని పోలీసులు సరిగా పని చేయలేదని ఆరోపించారు. ఎన్నికల ముందు కొంతమంది అదికారులను మార్చారని, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అధికారులపై ఫిర్యాదు చేసారని అన్నారు. ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే హింస చెలరేగిందని అన్నారు అంబటి.