మాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. అరెస్ట్ చేయండి.. గుంటూరు ఎస్పీకి అంబటి ఫిర్యాదు

మాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. అరెస్ట్ చేయండి.. గుంటూరు ఎస్పీకి అంబటి ఫిర్యాదు

ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల పర్వం నడుస్తోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వం ట్రోల్స్ ను సీరియస్ గా తీసుకున్న కూటమి సర్కార్ వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ గా వరుస అరెస్టులు చేపట్టింది. తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో అరెస్టులను అడ్డుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించింది వైసీపీ. వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలతో కలిసి గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.

తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. టీడీపీ సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. టీడీపీ పోస్టులకు సంబంధించిన అన్ని ఆధారాలు ఎస్పీకి సమర్పించామని అన్నారు అంబటి. విచారణ జరిపి టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు అంబటి రాంబాబు.

కాగా.. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని, అక్రమ అరెస్టులకు భయపడద్దని హామీ ఇచ్చారు జగన్. రాక్షస ఎల్లోమీడియా, అనైతిక సోషల్ మీడియాతో యుద్ధం చేస్తున్నామని.. ఈ యుద్ధంలో కచ్చితంగా న్యాయమే గెలుస్తుందంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు జగన్.