పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు: అంబటి రాంబాబు

రాష్ట్రంలో పోలీసుల నిర్లక్ష్యం వల్లే హింసాత్మక ఘటనలు జరిగాయని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసు అధికారులను ఈసీ మార్చిన తర్వాత హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు.  మే15వ తేదీ బుధవారం ఎన్నికల వేళ రాష్ట్రంలో జరుగుతున్న  దాడులపై  వైసీపీ నేతల బృందం డీజీపీని కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. కొందరు పోలీసుల సహకారంతో టీడీపీ కార్యకర్తల దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

 కూటమి ఫిర్యాదుతో ఈసీ పోలీసులను మార్చిందని అంబటి చెప్పారు. డీజీపీని కూడా కొత్తగా నిమయమించారని..  ఒక రిటైర్డ్ అఫీసర్ ను పోలీస్  అబ్జర్వర్ గా పెట్టారని తెలిపారు.  పల్నాడుతోపాటు కొన్ని ప్రాంతాల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. పోలీసు అధికారుల వైఫల్యం వల్లే  దాడులు జరుగుతున్నాయిన విమర్శించారు. మార్చిన పోలీసు అధికారులకు ఆ ప్రాంతాలపై సరైన అవగాహన లేదని... టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నా  పోలీసులు స్పందించలేదని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:సీఎస్, డీజీపీ ఢిల్లీకి రండి : ఏపీలో అల్లర్లపై కేంద్ర ఈసీ నోటీసులు