తప్పని నిరూపిస్తే.. పవన్ బూట్లు తుడుస్తాం.. ప్రభుత్వానికి అంబటి సవాల్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదం ఇష్యూ కాకరేపుతోన్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందన్న సీఎం చంద్రబాబు కామెంట్స్‏తో అధికార ఎన్డీఏ కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలోనే లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

 ఇవాళ (సెప్టెంబర్ 24) సత్తెనపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూ ఇష్యూపై చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని నిరూపించండి. మేం తప్పు చేశామని నిరూపిస్తే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బూట్లు తుడుస్తామని ఛాలెంజ్ చేశారు. మరీ తిరుపతి లడ్డూ అపవిత్రం అయిందని ఆంజనేయ స్వామి  మీద ప్రమాణం చేసి మీరు చెప్పగలరా అని ప్రశ్నించారు. 

ALSO READ | నిజం ఏంటీ అంటే : తిరుమల లడ్డూ వివాదం.. ఇప్పుడు పాకిస్తాన్ వరకూ వెళ్లింది.. !

తండ్రి చనిపోతే కూడా తలనీలాలు ఇవ్వని చంద్రబాబు కూడా హిందూ ధర్మం గురించి మాట్లాడటం దారుణమని ఎద్దేవా చేశారు. వైసీసీ, జగన్‎ను బదనాం చేయడంతో పాటు చంద్రబాబు సర్కార్ 100 రోజుల పాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే తిరుపతి లడ్డూ ఎపిసోడ్ తెరపైకి తెచ్చారని విమర్శించారు. తిరుపతి లడ్డూ కల్తీపై విచారణ సిట్‎తో కాదని.. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో చేయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు.