Ambati Rayudu: RCB పై రాయడు సెటైర్లు.. ఫ్యాన్స్ నిన్ను వదలరు అంటూ బంగర్ కౌంటర్

Ambati Rayudu: RCB పై రాయడు సెటైర్లు.. ఫ్యాన్స్ నిన్ను వదలరు అంటూ బంగర్ కౌంటర్

ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసింది. అయినా మన క్రికెట్ అభిమానులకు ఎలాంటి ఇబ్బంది లేదు. భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ కు మరో 11 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని జట్లు తమ క్యాంప్ చేరుకొని ప్రాక్టీస్ ను కూడా ప్రారంభించేశాయి. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత క్రికెటర్లు త్వరలో తమ ఐపీఎల్ జట్లలో చేరనున్నారు. ఎప్పటిలాగే ఈ సారి ఐపీఎల్ కు ముందు మాటల యుద్ధం ప్రారంభమైంది. భారత మాజీ క్రికెటర్లు అంబటి రాయడు, రాయల్ ఛాలెంజర్స్ మాజీ హెడ్ కోచ్ మధ్య ఐపీఎల్ కు సంబంధించిన చర్చలు జరిగాయి.

దుబాయ్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ జరుగుతున్న సమయంలో రాయుడు, బంగర్ కామెంటేటర్లుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్సీబీ జట్టుపై సంజయ్ బంగర్ ను తన ఆలోచనలను పంచుకోవాలని రాయుడిని అడిగాడు. దానికి బంగర్ మాట్లాడుతూ..   "గత 4-5 సంవత్సరాలుగా బెంగళూరు జట్టు ప్రదర్శన నిలకడగా ఉంది. జట్టు నాలుగు సందర్భాలలో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. గత సంవత్సరం ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఆ ఆతర్వాత వరుసగా విజయాలు సాధించి ప్లే ఆఫ్ కు చేరుకుంది. ఈ సారి ఎలిమినేటర్ అడ్డంకిని అధిగమిస్తుందని భావిస్తున్నాను." అని బంగర్ అన్నారు.

బంగర్ వ్యాఖ్యలకు రాయడు వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. అతని అభిప్రాయాలను ట్రోల్ చేశాడు. “సరే సంజయ్ భాయ్. ఆర్సీబీ  తదుపరి అడ్డంకిని దాటుతుంది. ఈ సారి ఆర్సీబీ క్వాలిఫయర్ 2కి చేరుకుంటుంది (నవ్వుతూ)” అని రాయుడు అన్నాడు. అంటే బెంగళూరు జట్టు ఈసారి కూడా కప్ కొట్టదు క్వాలిఫయర్ 2కి మాత్రమే చేరుకుంటుందని రాయుడి మాటల అర్ధం. రాయడు మాటలు బంగర్ కు నచ్చలేదు. రాయడు మాటలకు వెంటనే బంగర్ స్పందిస్తూ.. "ఇది చాలా తప్పు. నేను దీన్ని సహించలేను. ఆర్సీబీ  అభిమానులు నిన్ను చూస్తున్నారు." అని కౌంటర్ విసిరాడు. 

Also Read :- రూ.6 కోట్ల కంటే దేశమే ముఖ్యం

ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మొత్తం 19 మంది ప్లేయర్లను కొనుగులు చేసింది. మార్చి 22 న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. 

ఆర్సీబీ కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా:

జోష్ హాజిల్‌వుడ్.. రూ.12.50 కోట్లు (ఆస్ట్రేలియా, బౌలర్)
ఫిల్ సాల్ట్.. రూ.11.50 కోట్లు (ఇంగ్లండ్, బ్యాటర్)
జితేష్ శర్మ.. రూ.11.00 కోట్లు (బ్యాటర్)
భువనేశ్వర్ కుమార్.. రూ.10.75 కోట్లు (బౌలర్)
లియామ్ లివింగ్‌స్టోన్ర్.. రూ.8.75 కోట్లు (ఇంగ్లండ్, ఆల్ రౌండర్)
రసిఖ్ సలామ్.. రూ.6. కోట్లు (బౌలర్)
కృనాల్ పాండ్యా.. రూ.5.75 కోట్లు (ఆల్ రౌండర్)
టిమ్ డేవిడ్.. రూ.3 కోట్లు (ఆస్ట్రేలియా, ఆల్ రౌండర్)
సుయాష్ శర్మ.. రూ.2.60 కోట్లు (బౌలర్)
జాకబ్ బెథెల్.. రూ.2.60 కోట్లు (ఇంగ్లండ్, ఆల్ రౌండర్)
దేవదత్ పడిక్కల్.. రూ.2 కోట్లు (బ్యాటర్)    
నువాన్ తుషార.. రూ.1.60 కోట్లు (శ్రీలంక, బౌలర్)
రొమారియో షెపర్డ్.. రూ.1.50 కోట్లు (వెస్టిండీస్, ఆల్ రౌండర్)
స్వప్నిల్ సింగ్.. రూ.50 లక్షలు (ఆల్ రౌండర్)
స్వస్తిక్ చికారా.. రూ.30 లక్షలు (బ్యాటర్)    
మనోజ్ భాండాగే.. రూ.30 లక్షలు (ఆల్ రౌండర్)
మోహిత్ రతీ.. రూ.30 లక్షలు (బౌలర్)
అభినందన్ సింగ్.. రూ.30 లక్షలు (బౌలర్)
లుంగి ఎంగిడి.. రూ.1 కోటి (దక్షిణాఫ్రికా, బౌలర్)

ఆర్సీబీ రిటైన్ లిస్ట్:

విరాట్ కోహ్లీ.. రూ.21 కోట్లు (బ్యాటర్)
రజత్ పాటిదార్.. రూ.11 కోట్లు (బ్యాటర్)
యశ్ దయాల్.. రూ.5 కోట్లు (బౌలర్)