IPL 2024: RCB అందుకే టైటిల్ గెలవడం లేదు: అంబటి రాయుడు

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు పరాజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతి సీజన్ లాగే ఈ సారి ఆ జట్టులో స్టార్ ఆటగాళ్ళున్నా.. పరాజయాలు తప్పడం లేదు. టైటిల్ గెలవడం పక్కన పెడితే అసలు కనీసం ప్లే ఆఫ్ కు అర్హత సాధించడం కష్టంగా  మారింది. ఎప్పటిలాగే కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తుంటే మిగిలిన ఆటగాళ్లు విఫలమవుతున్నారు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు మ్యాక్స్ వెల్, కెప్టెన్ డుప్లెసిస్, గ్రీన్, అల్జారి జోసెఫ్ ఘోరంగా విఫలమవుతున్నారు. ఆర్సీబీ వరుస ఓటములపై అందరూ బౌలింగ్ ను తప్పు పడుతుంటే టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మాత్రం స్టార్ ప్లేయర్లపై మండిపడ్డాడు.
 
"ఆర్సీబీ జట్టు చూసుకున్నటైతే వారి బౌలింగ్ బలహీనంగా ఉన్న మాట నిజమే. అయితే బ్యాటింగ్ లో వారు మరింత వీక్ గా కనిపిస్తున్నారు. ఒత్తిడి సమయంలో ఆడే ప్లేయర్లు ఆ జట్టులో లేకపోవడం అసలు సమస్యగా మారింది. బ్యాటింగ్ ఆర్డర్ లో దినేష్ కార్తీక్ తో యంగ్ ప్లేయర్లను లోయర్ ఆర్డర్ లో పంపిస్తున్నారు. ఇదే ఆర్సీబీ జట్టుకు విజయాలను దూరం చేస్తుంది. ఇలా జరుగుతున్నంత కాలం ఆ జట్టు టైటిల్ గెలవడం కష్టం". అని రాయడు స్టార్ స్పోర్ట్స్ ద్వారా చెప్పుకొచ్చాడు. 

ALSO READ :- హల్దిరాం ట్రేడ్ మార్క్, గుర్తుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం ఆర్సీబీ నాలుగు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ లోనే గెలిచింది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో చిత్తుగా ఓడిన తర్వాత పంజాబ్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అయితే మళ్ళీ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి ప్లే తీవ్ర ఒత్తిడిలో పడింది. బెంగళూరు తమ తర్వాత మ్యాచ్ ను రాజస్థాన్ రాయల్స్ తో ఏప్రిల్ 6న ఆడుతుంది.