MLA సీటు కాదు.. వైసీపీని వీడటానికి గల అసలు కారణం చెప్పిన రాయుడు

MLA సీటు కాదు.. వైసీపీని వీడటానికి గల అసలు కారణం చెప్పిన రాయుడు

భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మళ్ళీ క్రికెట్ లోకి రానున్నాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లో భాగంగా ముంబైగ ఇండియన్స్ ఎమిరేట్స్  నుంచి ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నాడు. ఇటీవలే రాయుడు వైసీపీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. క్రికెట్ ను వదిలి రాజాకీయాల్లోకి వద్దామనుకున్న రాయుడుకు MLA సీటు ఇవ్వలేదని.. అందుకే మళ్ళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడని అందరూ భావించారు. అయితే తాజాగా రాయుడు ఎందుకు రాజీనామా అసలు కారణం చెప్పేసాడు. 

ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లో ముంబై ఎమిరేట్స్ నుంచి రాయుడు  ఆడాలనుకుంటున్నాడు. అయితే ఈ టోర్నీ ఆడాలనుకుంటే రాజకీయ పరంగా ఎలాంటి జోక్యం ఉండకూడదని రాయుడు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. జనవరి 20 నుంచి ఇంటర్నేషనల్ టోర్నీ జరగనుంది. వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపిన రాయుడు.. కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. పార్టీలో జాయిన్ అయిన తొమ్మిది రోజులకే రాయుడు రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.  

రాజకీయాల కోసమే ఐపీఎల్ కి దూరం

భారత క్రికెటరైన రాయుడు రాజకీయాల కోసమే ఐపీఎల్‌కి దూరమయ్యాడు. తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని ఎన్నోసార్లు చెప్పిన రాయుడు.. గతేడాది ప్రారంభంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి తప్పుకున్నాడు. అనంతరం వైసీపీ తరుపున అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఈ క్రమంలోనే గత నెల డిసెంబర్ 28న అధికారికంగా వైసీపీలో జాయిన్ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో రాయుడికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పిన సీఎం జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అలాంటిది రాయుడు తొమ్మిది రోజులకే పార్టీ వీడడం పలు అనుమానాలకు తావిస్తోంది.