
కరీంనగర్ శుభమంగళ గార్డెన్లో.. బీజేపీ నిర్వహించిన జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో కేంద్రమంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. కొంతమంది ఆ మహనీయుడిని దళితులకే పరిమితం చేస్తున్నారని .. కాని ఆయన భారతదేశ ప్రజలందరికి దేవుడన్నారు. అంబేద్కర్ జీవితాన్ని యువత ఆదర్శంగాతీసుకోవాలని బండి సంజయ్ సూచించారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పడినన్ని అవమానాలు ఎవరు ఎదుర్కోలేదన్న కేంద్రమంత్రి వాటినే సోపానాలుగా మార్చుకొని తన చదువును దేశానికి ధారపోసిన గొప్పనేత అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను అవమానించిందని.. ఆయనకు భారతరత్న ఇవ్వకుండా... ఎన్నికల్లో ఓడించిందన్నారు. అంబేద్కర్ చనిపోతే ఢిల్లీలో అంత్యక్రియలు చేసేందుకు అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ పార్టీ .. ఆయన పార్థివ దేహాన్ని ముంబయి కి పంపి అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విమాన చార్జీలు వసూలు చేసిందన్నారు. అంబేద్కర్ ఆశయాలను బీజేపీ అమలు చేస్తుంటే కాంగ్రెస్ ఆయన చరిత్రను కనుమరుగు చేసేందుకు కుట్ర పన్నుతుందన్నారు. ఒకప్పుడు రిజర్వేషన్లను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఓట్లకోసం ముస్లిం రిజర్వేషన్లకు కుట్ర చేసిందని కేంద్రమంత్రి బండిసంజయ్ అన్నారు.