రోడ్ సేఫ్టీపై ‘అంబేద్కర్​ కాలేజీ’ అవగాహన

రోడ్ సేఫ్టీపై ‘అంబేద్కర్​ కాలేజీ’ అవగాహన
  • ర్యాలీలో పాల్గొన్న డిగ్రీ, లా కాలేజీ స్టూడెంట్లు 

ముషీరాబాద్, వెలుగు : బాగ్​లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్​అంబేద్కర్ డిగ్రీ, లా కాలేజీల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ​యూనిట్, వన్​టూ త్రీ నెహ్రూ యువ కేంద్రం నేతృత్వంలో గురువారం రోడ్​సేఫ్టీపై అవగాహన కల్పించారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. 

ట్రాఫిక్​రూల్స్ పాటించాలని, హెల్మెట్​ధరించాలని నినాదాలు చేశారు. డిగ్రీ, లా కాలేజీల డైరెక్టర్ విష్ణుప్రియ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ బండ్ల శ్రీధర్, వరలక్ష్మి, స్వప్న, కుమారస్వామి, లా కాలేజీ ప్రిన్సిపాల్ సృజన, స్టూడెంట్లు పాల్గొన్నారు.