ఓయూ వెయిట్​ లిఫ్టింగ్​ పోటీల్లో .. అంబేద్కర్​ కాలేజీ స్టూడెంట్ల హవా

ముషీరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్​వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్​షిప్ పోటీల్లో బాగ్​లింగంపల్లిలోని కాకా డాక్టర్​బీఆర్​అంబేద్కర్​కాలేజీ స్టూడెంట్లు సత్తా చాటారు. మొత్తం 14 కాలేజీల స్టూడెంట్లు పాల్గొనగా, అంబేద్కర్​కాలేజీ స్టూడెంట్లు చాంపియన్​షిప్​సాధించారు.గురువారం జరిగిన ఫైనల్​పోటీల్లో 96 కిలోల విభాగంలో జె.సాయి వర్థన్ గోల్డ్, 109+ విభాగంలో బి.కార్తీక్ గోల్డ్, 81 కిలోల విభాగంలో సయ్యద్ ఉనైస్ అయాజ్ బ్రాంజ్, 67 కిలోల విభాగంలో బి.శరత్ కుమార్​బ్రాంజ్, 61 కిలోల విభాగంలో మహమ్మద్ ఆసిఫ్ బ్రాంజ్,  55 కిలోల విభాగంలో ఎం.

లక్ష్మీనరసింహ బ్రాంజ్​మెడల్స్​కైవసం చేసుకున్నారు. శుక్రవారం ప్రొఫెసర్ రాజేష్ దీప్ల, వివిధ కాలేజీల ఫిజికల్ డైరెక్టర్లు కలిసి విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్, ఓవరాల్ చాంపియన్​షిప్​షీల్డ్​ప్రదానం చేశారు. పోటీల్లో సత్తా చాటిన స్టూడెంట్లను అంబేద్కర్ కాలేజీ యాజమాన్యం, లెక్చరర్లు, సిబ్బంది అభినందించారు.