
న్యూయార్క్: అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14ను ‘అంబేద్కర్ డే’గా న్యూయార్క్ సిటీ ప్రకటించింది. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా న్యూయార్క్‌లోని యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్‌లో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
దీనికి మన దేశ కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏటా ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని అధికారికంగా నిర్వహించనున్నట్టు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు. దీనిపై మేయర్ ఆఫీస్ డిప్యూటీ కమిషనర్ దిలీప్ చౌహాన్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా వాళ్లిద్దరికీ రామ్‌దాస్ అథవాలే కృతజ్ఞతలు తెలియజేశారు.