బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్లో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. అలూమ్ని వేడుకల్లో కాలేజీస్టూడెంట్స్, పూర్వ విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తమ ఫ్యాకల్టీకి, స్టూడెంట్లకు అవార్డులు అందజేశారు. కేంద్ర మాజీ మంత్రి, కాకా జీవిత చరిత్రపై విద్యార్థులు చేసిన స్కిట్ ఆకట్టుకుంది. కాలేజీ ఎంట్రన్స్ లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ తిలకించారు.
మహనీయుడు కాకా
కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ నేత గడ్డం వెంకటస్వామి (కాకా) పదో వర్ధంతిని సిటీలో ఆదివారం నిర్వహించారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కుటుంబసభ్యులతోపాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ఆయా చోట్ల వివిధ సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేశారు.
కాకా, పీవీ రావు త్యాగాలు మరువలేనివి
కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి (కాకా), మాల మహానాడు వ్యవస్థాపకుడు పీవీ రావు వర్ధంతిని మింట్ కాంపౌండ్ లోని అంబేద్కర్ స్పూర్తి భవన్ లో నిర్వహించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, ఇతర లీడర్లు పాల్గొన్నారు.