
మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ర్రాసిన రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతుందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. అంబేద్కర్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ కుట్రలను అందరం కలిసి తిప్పి కొట్టాలన్నారు. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా పెద్ద పల్లి, గోదావరి ఖనిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీజేపీ ప్రభుత్వంపై పోరాటానికి అంతా కలిసి రావాలన్నారు. దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబే ద్కర్రాసిన రాజ్యాంగం దేశంలో ప్రమాదంలో పడిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతులను అణిచివేస్తున్నారని ఫైర్అయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంతా కలిసి పోరాటం చేసే టైం వచ్చిందన్నారు. అంబేద్కర్ ను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆయన ఆశయ సాధన కోసం అందరం కృషి చేద్దామన్నారు. కార్మిక వర్గానికి ఎనిమిది గంటల పని దినాలను తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు వంశీకృష్ణ.
బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాలకు పైగా కష్టపడి రాజ్యాంగం రాశారని, రాజ్యాంగం రాసి 70 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆయన రాసిన బాటలోనే మనం నడుస్తున్నామని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కానీ ఆయనను కానీ పార్లమెంట్ సాక్షిగా అవమాన పరుస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం ద్వారా అందరికీ సమానంగా హక్కులు కల్పించారని, సామాజిక న్యాయ సాధన కోసమే రాజ్యాంగాన్ని రాశారని కొనియాడారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగానే ఆర్బిఐని స్థాపించారని గుర్తుచేశారు