
వికారాబాద్, వెలుగు: అంబేద్కర్ అంటే ఒక పేరు కాదని.. ఈ దేశ ప్రజల జీవన రేఖ అని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలంలోని సయ్యదల్లిపూర్, మర్పల్లి మండలం పంచలింగాల గ్రామాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆదివారం ఆయన ఆవిష్కరించారు.
అట్టడుగు వర్గాలకు అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన పోరాట స్పూర్తితో నేటి యువత తమ జీవిత లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. అనంతరం పంచ లింగాలలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. రూ.30 లక్షలతో నిర్మించునున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.