సామాజిక సేవ చేస్తున్నోళ్లకు ప్రోత్సాహం అందిద్దాం : వివేక్ వెంకటస్వామి

సామాజిక సేవ చేస్తున్నోళ్లకు ప్రోత్సాహం అందిద్దాం : వివేక్ వెంకటస్వామి
  • వృద్ధిలోకి వచ్చినోళ్లు.. మరో పది మందికి హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి: వివేక్ వెంకటస్వామి 
  • దీన శరణ్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానం

బషీర్​బాగ్, వెలుగు: సామాజిక సేవ చేస్తున్న వారిని గుర్తించి, వారికి ప్రోత్సాహం అందించేందుకు అవార్డులు ఇవ్వడం అభినందనీయమని చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్ అబిడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సూర్య లోక్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న పీపుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కార్యాలయంలో దీన శరణ్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి అవార్డ్స్ ప్రదానోత్సవం కార్యక్రమం సంస్థ చైర్మన్ చింతల సాయిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వివేక్ వెంకటస్వామి ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. 

ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, మేధావులకు, సమాజ సేవకులకు అంబేద్కర్ అవార్డులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దీన శరణ్య స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎంతో మంది అనాధలకు ఆశ్రయం కల్పిస్తూ, వెనుకబడిన విద్యార్థులకు స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ ఇస్తున్న న్యాయవాది సాయిబాబు సేవలను కొనియాడారు. అలాగే, యువ లాయర్లకు కోర్టుల్లో ఆర్గ్యుమెంట్స్ ఎలా చేయాలో కూడా శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. 

శిక్షణ పొందిన వారు ఉన్నత స్థాయికి చేరుకొని రోల్ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలవాలని ఆకాంక్షించారు. అలాగే మరో పది మందికి సహాయం చేసి, తోడ్పాటు అందించాలని సూచించారు. అనంతరం దీన శరణ్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వివేక్ వెంకటస్వామిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జిల్లా జడ్జి నిమ్మ నారాయణ , డీఎస్పీ విష్ణుమూర్తి, ఏజీపీ కృష్ణమోహన్, న్యాయవాది నాగుల శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ మాల వారియర్స్ ఫౌండర్ చైర్మన్ జంగా శ్రీనివాస్, పీపుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.