భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని.. మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజల ఐక్యత, హక్కులకు నిదర్శనం అంబేడ్కర్ రాజ్యాంగమని ఆయన కొనియాడారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా నల్గొండలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ స్పూర్తి, ఆలోచన, ఆశయాలను అమలు చేస్తున్న నాయకుడు కేసీఆర్ ఒక్కరేనని జగదీష్ రెడ్డి చెప్పారు. ప్రజలంతా ఆర్దికంగా, సామాజిక పరంగా సమానత్వం సాధించడమే అంబేడ్కర్ లక్ష్యమని గుర్తుచేశారు.
విద్యను అన్ని వర్గాల ప్రజలకు అందించడం అంబేడ్కర్ ఆశయమని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఆయన స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అద్భుత సమాజ నిర్మాణం కోసం పౌరులంతా పాటుపడాలని జగదీష్ రెడ్డి చెప్పారు.