అచ్చంపేట ఎంఈవోపై కేసులు ఎత్తేయాలి :అంబేద్కర్  సంఘం

అచ్చంపేట ఎంఈవోపై కేసులు ఎత్తేయాలి :అంబేద్కర్  సంఘం

అమ్రాబాద్, వెలుగు: అచ్చంపేట ఎంఈవోపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తేయాలని అంబేద్కర్  సంఘం జిల్లా అధ్యక్షుడు జక్క బాలకిష్టయ్య డిమాండ్  చేశారు. ఆదివారం మీడియాతో మా ట్లాడుతూ.. ఎంఈవోగా పని చేస్తున్న జీవన్ కుమార్  విధి నిర్వహణలో భాగంగా స్కూల్  టీచర్ ను మండలించడంతో జీర్ణించుకోలేక అసత్య ఆ రోపణలు చేస్తూ కేసు పెట్టారన్నారు. ఎంఈవోపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్  చేశారు. సామ అనిల్, చంద్రశేఖర్, ఆంజనేయులు ఉన్నారు.