కౌన్సిలర్​ను అరెస్ట్​ చేయాలని అంబేద్కర్ సంఘాల ధర్నా

ఆదిలాబాద్, వెలుగు: మావలకు చెందిన దళిత యువకుడు ఎంబడి వంశీపై హత్యాయత్నానికి పాల్పడిన కౌన్సిలర్ రఘుపతిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సంఘాల ఐక్య కార్యాచరణ పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. హత్యాయత్నం కేసులో ఏ1గా ఉన్న రఘుపతిని 15 రోజులైనా అరెస్టు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వెంటనే కౌన్సిలర్ పదవి నుంచి రఘుపతిని తొలగించాలని, లేకపోతే 6వ తేదీన ఆదిలాబాద్ బంద్ చేపడుతామని హెచ్చరించారు. పరువు హత్యలు నశించాలని నినదించారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి ధర్నా వద్దకు చేరుకొని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సమితి నాయకులు భూమన్న, నవీన్, మేకల మల్లన్న, మొట్టె కిరణ్, రాజన్న, నల్ల రాజేశ్వర్, అగ్గిమల్ల గణేశ్, శోభాతాయి తుల్జాపూరే పాల్గొన్నారు.