రాజన్న సిరిసిల్ల, వెలుగు: ముదిరాజ్‌లకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు 30 శాతం అసెంబ్లీ సీట్లు కేటాయించాలని ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. జోరు వాననూ లెక్కచేయకుండా భారీగా తరలివచ్చినా ముదిరాజ్‌లు రెండు గంటల సేపు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్బంగా ముదిరాజ్ నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే కనీసం ఒక్క ముదిరాజ్‌కు సీటు ఇవ్వలేదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్‌లు 60లక్షలు మంది ఉన్నారని, అయినా ఒక్కసీటు కేటాయించకపోవడం దారుణమని మండిపడ్డారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రాణవేణి లక్ష్మణ్, కోర్ కమిటీ సభ్యుడు పిట్టల భూమేశ్, రాము, గోపి, మల్లిఖార్జున్, నాగరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.