అంబేద్కర్ విగ్రహం తొలగింపు కేసులో ఇద్దరు అరెస్ట్

అంబేద్కర్ విగ్రహం తొలగింపు కేసులో ఇద్దరు అరెస్ట్

అంబేద్కర్ విగ్రహం తొలగింపు కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు జహర్ నగర్ పోలీసులు. జీహెచ్ఎంసీ చెత్త డంపింగ్ లారీ డ్రైవర్ డప్పు రాజుతో పాటు జేసీబీ ఆపరేటర్ గుప్తను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిని కోర్టులో హాజరుపరిచారు.  మరో ఇద్దరు జీహెచ్ఎంసీ ఉద్యోగులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పంజాగుట్ట చౌరస్తా నుంచి తొలగించిన విగ్రహాన్ని..  సురక్షితంగా ఉంచకుండా డంపింగ్ లారీలోకి ఎక్కించే సమయంలో.. విగ్రహం పగిలిపోయిందని పోలీసులు వివరించారు.