ప్రతీ ఊరిలో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలి

నాన్న వెంకట స్వామి అంబేద్కర్ స్ఫూర్తి కోసం పోరాడారని తెలిపారు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి. నల్గొండలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు వివేక్ వెంకట స్వామి. ఈ సందర్భంగా మాట్లాడతూ.. ఆరోజుల్లోనే అంబేద్కర్ 23 డిగ్రీలు సంపాధించారని తెలిపారు. మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని రాజ్యాంగంలో రాశారని చెప్పారు. ప్రతీ ఊరిలో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మంచిగా చదివినప్పుడే కులవివక్ష పోతుందని అంబేద్కర్ చెప్పారన్నారు. దళితులు ఐక్యతతోనే ఉన్నపుడే మన హక్కులు కాపాడుకోగలమన్న వివేక్ వెంకటస్వామి.. అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తే 50000 రూపాయలు ఇస్తానని తెలిపారు..ఇప్పటి వరకు 100 అంబేద్కర్ విగ్రహాలు పెట్టానని చెప్పారు వివేక్ వెంకటస్వామి.