అంబేద్కర్ వర్సిటీ బీఈడీ ఎంట్రెన్స్ రిజల్ట్స్

హైదరాబాద్,వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలయ్యాయి.  ఈ నెల 6న జరిగిన బీఈడీ ఎగ్జామ్​కు 6,834  అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 5,761 మంది క్వాలిపై అయ్యారు. బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)లో  2,267  మంది అభ్యర్థులు అటెండ్ కాగా,  1,960 మంది  అర్హత సాధించారని అధికారులు ప్రకటించారు. ఫలితాలను  www.braouonline.in వెబ్ సైట్​లో చూసుకోవాలని సూచించారు.

ALSOREAD:నంగునూరులో బయటపడిన రాతిపూస