
లక్షెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఊట్కూర్ చౌరస్తా దగ్గర రెండు వైపులా, కరీంనగర్ చౌరస్తా వద్ద తాత్కాలిక బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ కు వినతిపత్రం అందజేశారు. పట్టణ యువజన సంఘం అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. బస్షెల్టర్లు లేక వేసవిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఊట్కూర్చౌరస్తా వద్ద, కరీంనగర్వైపు షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అంబేద్కర్ సంఘం లీడర్లు బైరం లింగన్న, అల్లంపల్లి రమేశ్, పొగరు ఏసన్న, మహేశ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు