Ambedkar Jayanti 2025 : దేశ విభజనను అంబేద్కర్ ఎందుకు సమర్థించారు..? అంబేద్కరిజం ఫాలో అవుతున్న సినీ దర్శకుడు ఎవరు..?

Ambedkar Jayanti 2025 : దేశ విభజనను అంబేద్కర్ ఎందుకు సమర్థించారు..? అంబేద్కరిజం ఫాలో అవుతున్న సినీ దర్శకుడు ఎవరు..?

పాకిస్తాన్ అంశంపై అంబేద్కర్ ముందు నుంచీ స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. దేశ విభజనను వ్యతిరేకించిన వాళ్లను ఉద్దేశించి ఆయన ఈ మాటలన్నారు. 

“భారతదేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి భాష, ఉమ్మడి జాతి, ఉమ్మడి దేశం తదితర సామాజిక అంశాల్లో హిందువులు, ముస్లింల ఆలోచనలు ఒకేలా ఉన్నాయన్న మాట వాస్తవమే. అయితే, వారిని కలిపివుంచే ఈ విషయాల కన్నా విభజించే రాజకీయ, మతపరమైన అంశాలే ఎక్కువ బలంగా ఉన్నాయి. 

భాయూ పరమానంద్ 'హిందూ జాతీయోద్యమం' పుస్తకంలో.. 'హిందువులు పృథ్వీరాజు, రాణాప్రతాప్ ను, శివాజీని మాతృభూమి విముక్తి కోసం పోరాడిన యోధులుగా తల్చుకుంటే.. ముస్లింలు భారతదేశ దురాక్రమణదారులైన మహమ్మద్ బిన్ ఖాసిమ్, ఔరంగజేబు వంటి వారిని జాతీయ కథానాయకులుగా భావిస్తారు' అని రాశాడు

అలాగే హిందువులు రామాయణం, భారతం, భగవద్గీతల నుంచి స్ఫూర్తిపొందితే ముస్లింలు ఖురాన్ నుంచి స్ఫూర్తిని పొందుతారు. హిందూ, ముస్లింలు తమగతాన్ని మర్చిపోతే వారిద్దరూ కలిసి ఒకే దేశంగా ఉండే అవకాశం ఉండేదేమో. కానీ, వారి గతం వారి మతంతో ముడిపడి ఉంది. గతాన్ని విడిచిపెట్టడమంటే మతాన్ని విడిచిపెట్టడమే. కాబట్టి.. అది సాధ్యం కాని పని. 

►ALSO READ | Ambedkar Jayanti 2025 : అంబేద్కర్ ఫిలాసఫీ ఎంత మందికి తెలుసు.. గాంధీ తత్వంపై ఆయన అభిప్రాయం ఏంటీ..?

ఒక దేశంగా కలిసి ఉండాలన్న తీవ్రమైన వాంఛ, ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన భూభాగం ఈ రెండూ ఉన్నాయి కాబట్టి. పాకిస్తాన్ ఒక దేశంగా ఉండాలన్న ఆలోచన సమర్థించదగ్గదే. భారతదేశానికి స్వాతంత్య్రం రాగానే పాకిస్తాన్ కొత్త దేశంగా వేరుపడటాన్ని అంబేద్కర్ స్వాగతించాడు. 'ఎంతో సంతోషించాను' అని మాట్లాడాడు.

భీమ్.. ఇవ్వాల్టికీ పాపులర్ ! 

అంబేద్కర్ పూర్తి పేరులో భీమ్రావు నుంచి 'భీమ్', రామ్ నుంచి 'జీ' తీసుకొని 'భీమ్ జీ' అనే పేరు పెట్టుకోవడం ఒక అలవాటు. అంబేద్కర్ సిద్ధాంతాన్ని, అంబేద్కరిజాన్ని నమ్మి పాటిస్తున్నామని చెప్పడమే ఈ పేరు ఉద్దేశం. పాపులర్ తమిళ సినీ దర్శకుడు 'పా రంజిత్', తన ట్విటర్ యూజర్నేమన్ను 'భీమ్ ' అనే పెట్టుకున్నాడు. పా రంజిత్ తన సినిమాల్లో చూపించేది కూడా దళితుల జీవితమే. దళితుల జీవితాన్ని, ఉద్యమాన్ని ఇలా మెయిన్ స్ట్రీమ్ సినిమాకు తీసుకొచ్చిన దర్శకుడిగా రంజితు మంచి పేరుంది. రంజిత్లాగే అంబేద్కర్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేవాళ్లు తమ పేరుకు ముందు 'భీమ్ ' చేర్చుకుంటుంటారు.

కులాంతర వివాహాలు చేసుకుంటే, అందులో ఒకరు దళితులు అయినప్పుడు హత్యలు చేయడం, దళితుడన్న కారణంగా అందరితో సమానంగా చూడకపోవడం... ఇలాంటి సామాజిక సమస్యలు ఇంకా అలాగే ఉన్న ఈ రోజుల్లో 'భీమ్ జీ' మాట ఒక పాపులర్ ట్రెండ్.