కేంద్ర మంత్రి అథవాలేకి అంబేద్కర్ ఫొటో సాధన సమితి వినతి
హైదరాబాద్, వెలుగు: కరెన్సీ నోట్లపై బీఆర్ అంబేద్కర్ ఫొటో ముద్రించాలని అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జెరిపోతుల పరశురాం డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఈ నెల 26న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నామని సోమవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆవిష్కరించారు. అనంతరం బేగంపేట హరిత ప్లాజాలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేని కలిసి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఇది న్యాయమైన అంశంమని, పార్లమెంటు సమావేశాల్లో దీనిపై మాట్లాడతానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని పరుశురాం తెలిపారు. కృష్ణయ్య మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.