- జేఎన్టీయూలో వర్ధంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి
కూకట్పల్లి, వెలుగు: సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతే అంబేద్కర్ ఆలోచనా విధానమని, అంబేద్కర్‌ను దళితులకు మాత్రమే ప్రతినిధిగా చిత్రీకరించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. శుక్రవారం జేఎన్టీయూ క్యాంపస్‌లో నిర్వహించిన డాక్టర్‌బీఆర్ అంబేద్కర్వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాంపస్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రతిఒక్కరికీ సమాన హక్కులు అందించాలనే లక్ష్యంతో అంబేద్కర్రాజ్యాంగాన్ని రచించారని, నెలకు ఒకసారైనా రాజ్యాంగాన్ని చదవడం అలవాటు చేసుకోవాలని స్టూడెంట్లకు సూచించారు.
అసమానతలను రూపుమాపి, సమసమాజ స్థాపనే ధ్యేయంగా అంబేద్కర్సాగించిన పోరాటం నేడు సత్ఫలితాలను ఇస్తోందన్నారు. అంబేద్కర్జీవితం పాజిటివిటీని పెంచుతుందన్నారు. మహిళల హక్కుల రక్షణకు చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. జేఎన్టీయూ రెక్టార్ విజయకుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
జేఎన్టీయూలో మహిళా డైరెక్టర్‌కు అవమానం!
వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు తనను అవమానించారని కూకట్పల్లి జేఎన్టీయూ క్యాంపస్‌లోని ఫారిన్ రిలేషన్స్ డైరెక్టర్వసుమతి ఆరోపించారు. గేటు వద్దే తన కారును ఆపివేయించారని వాపోయారు. అంబేద్కర్వర్ధంతికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. తనకు డ్రైవర్‌ను కేటాయించాలని అడిగితే ‘నీకు యంగ్ డ్రైవర్లు కావాలా’ అంటూ అవమానకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆరోపణలను రిజిస్ట్రార్ కొట్టి పడేశారు.