రామగుండం సీపీ​గా అంబర్​ కిషోర్​ ఝా

రామగుండం సీపీ​గా అంబర్​ కిషోర్​ ఝా

గోదావరిఖని, వెలుగు :  రామగుండం పోలీస్​ కమిషనర్​గా అంబర్​ కిషోర్​ ఝాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్​ సెక్రటరీ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు రామగుండం కమిషనర్​గా వ్యవహరించిన ఎం.శ్రీనివాస్​ను హైదరాబాద్​ సీఐడీ విభాగం ఐజీగా బదిలీ చేశారు. పెద్దపల్లి డీసీపీగా పనిచేసిన డాక్టర్​ చేతనను హైదరాబాద్​ ఉమెన్​ సేప్టీ వింగ్​ ఎస్పీగా బదిలీ చేశారు.

ఆమె స్థానంలో పోస్టింగ్​ కోసం వెయిటింగ్​లో ఉన్న నాన్​ క్యాడర్​ ఆఫీసర్​  పి. కరుణాకర్​ను పెద్దపల్లి డీసీపీగా నియమించారు. రామగుండం పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని మంచిర్యాల డీసీపీగా పోస్టింగ్​ కోసం వెయిటింగ్​లో ఉన్న నాన్​ క్యాడర్​ ఆఫీసర్​ ఎ.భాస్కర్​ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.