సీపీగా చార్జ్‌‌‌‌‌‌‌‌ తీసుకున్న అంబర్‍ కిశోర్‌‌‌‌‌‌‌‌ ఝా

వరంగల్, వెలుగు : వరంగల్‍ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా అంబర్‌‌‌‌‌‌‌‌ కిశోర్‌‌‌‌‌‌‌‌ ఝా నియామకం అయ్యారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న సీపీ రంగనాథ్‌‌‌‌‌‌‌‌ను ఈసీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఆయన స్థానంలో కిశోర్‌‌‌‌‌‌‌‌ ఝాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శుక్రవారం సాయంత్రం ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌, క్రైమ్స్‌‌‌‌‌‌‌‌ డీసీపీ మురళీధర్‌‌‌‌‌‌‌‌ నుంచి చార్జ్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆయనను సెంట్రల్‌‌‌‌‌‌‌‌,  వెస్ట్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ డీసీపీలు అబ్దుల్‌‌‌‌‌‌‌‌ బారీ, సీతారాం మర్యాదపూర్వకంగా కలిశారు.

2009 బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు చెందిన కిశోర్‌‌‌‌‌‌‌‌ ఝా 2012లో వరంగలో ఓఎస్‌‌‌‌‌‌‌‌, అడిషనల్‌‌‌‌‌‌‌‌ ఎస్పీగా పనిచేశారు. మహబూబాబాద్/భూపాలపల్లి అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ ఎస్పీ చంద్రమోహన్‌‌‌‌‌‌‌‌ స్థానంలో పాటిల్‌‌‌‌‌‌‌‌ సంగ్రామ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ నియామకం అయ్యారు. శుక్రవారం జిల్లా ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో చార్జ్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నారు. అలాగే భూపాలపల్లి ఎస్పీగా నియామకం అయిన కిరణ్‌‌‌‌‌‌‌‌ ఖారే శుక్రవారం రాత్రి బాధ్యతలు తీసుకున్నారు. ముందుగా జిల్లా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.