మార్చి1లోగా అంబర్ పేట ఎస్టీపీని ప్రారంభించాలి

మార్చి1లోగా అంబర్ పేట ఎస్టీపీని ప్రారంభించాలి
  • అధికారులకు వాటర్​బోర్డు ఎండీ ఆదేశం 

హైదరాబాద్​సిటీ, వెలుగు : అంబర్ పేటలో నిర్మిస్తున్న ఎస్టీపీ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి, మార్చి1 లోపు ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని వాటర్​బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఈడీ మయాంక్ మిట్టల్ తో కలిసి ఆయన ఎస్టీపీని సందర్శించారు. 

సివిల్ పనులు పూర్తయ్యాయని, ఎలక్ట్రో మెకానికల్ పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. రెండు బేసిన్ల డ్రై రన్ పూర్తిచేసినట్లు చెప్పారు. ప్రాజెక్టు ఎస్టీపీ డివిజన్1 జీఎం, అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.