న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌కు చెందిన అంబుజా సిమెంట్ (ఏసీఎల్) బిహార్‌లో రూ.1,600 కోట్ల పెట్టుబడితో సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. నవాడా జిల్లాలోని వారిసలిగంజ్ దగ్గర ఈ ప్లాంట్ ఏర్పాటుకానుంది. దీని కెపాసిటీ 6 మిలియన్ టన్స్ పెర్ యానమ్ (ఎంటీపీఏ). ‘ప్రాజెక్ట్‌ను మూడు ఫేజ్‌లలో నిర్మిస్తాం.
మొదటి ఫేజ్‌లో రూ.1,100 కోట్ల పెట్టుబడితో 2.4 ఎంటీపీఏ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా’ అని అంబుజా సిమెంట్ తెలిపింది. కంపెనీకి బిహార్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (బీఐఏడీఏ) 67.90 ఎకరాల భూమిని కేటాయించింది. పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయి. బిహార్‌లో అంబుజాకు ఇదే మొదటి ఇన్వెస్ట్‌మెంట్.