
న్యూఢిల్లీ: అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్స్ వినోద్బహెటీని సీఈఓగా నియమించింది. ప్రస్తుతం ఈయన సీఎఫ్ఓగా పనిచేస్తున్నారు. అజయ్ కపూర్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా అపాయింట్ చేసింది. వినోద్ అడిషనల్ డైరెక్టర్‌గానూ, హోల్‌టైం డైరెక్టర్‌గానూ మూడేళ్లపాటు పనిచేస్తారని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా రాకేశ్ తివారీ వ్యవహరిస్తారు. ప్రవీణ్ గార్గ్‌ను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించింది. ఈయన కూడా మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. సీఈఓ, హోల్‌టైం డైరెక్టర్ బాధ్యతల నుంచి అజయ్ కపూర్‌ను తొలగించింది. ఈ మార్పులన్నీ వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని అంబుజా సిమెంట్స్ తెలిపింది.