కేటీఆర్ పర్యటనతో 3 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌: సిటీలోని ఎల్బీనగర్‌‌లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బైరామల్ గూడ ప్లై ఓవర్ ప్రారంభానికి కేటీఆర్ రాక నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ నిలిపేశారు. దీంతో దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఎల్బీనగర్, హయత్ నగర్, నాగోల్, కొత్తపేట నుంచి వచ్చే రూట్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలనీల నుంచి వచ్చే వెహికిల్స్ ను కూడా పోలీసులు ఆపేశారు. రెండు అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. మంత్రి కేటీఆర్ పర్యటన కోసం ట్రాఫిక్ ను అడ్డుకోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.