మెదక్ జిల్లాలో ఓ అంబులెన్స్ టెక్నీషియన్ సమయస్ఫూర్తితో వ్యవహరించి అప్పుడే పుట్టిన పాప ప్రాణాలు కాపాడాడు. శనివారం ( జనవరి 18, 2025 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పాప ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుండగా...108 వాహనంలో హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.మార్గమధ్యలో పాప గుండె ఆగిపోయింది.. దీంతో వెంటనే స్పందించిన అంబులెన్స్ టెక్నీషియన్ రాజు సీపీఆర్ చేసి పాప ప్రాణాలు కాపాడాడు.
సమయానికి సీపీఆర్ చేయడంతో పాప తిరిగి ఊపిరి తీసుకుంది.. అనంతరం హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించడంతో పాప ఆరోగ్యంగా ఉందని తెలుస్తోంది. పాప ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ టెక్నీషియన్, డ్రైవర్ ను జిల్లా అధికారులు అభినందించారు. సమయస్ఫూర్తితో పాప ప్రాణాలు రక్షించినందుకు రాజు పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశారు.