
ఆంధ్రప్రదేశ్ లో అంబులెన్స్.. డివైడర్ ను ఢీకొన్న ఘటనలో డ్రైవర్ తో సహా ఇద్దరికి కు తీవ్ర గాయాయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే... గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న పేషంట్ ను తాడేపల్లిగూడెం నుంచి విజయవాడకు అంబులెన్స్‌లో శుక్రవారం ఉదయం ( ఫిబ్రవరి 28) తరలిస్తున్నారు. మితిమీరిన మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న అంబులెన్స్ భీమడోలు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలోఅదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ అతని అసిస్టెంట్ రోగి బంధువు కు గాయాలయ్యాయి ..సమాచారం అందుకున్న 108 సిబ్బంది రోగిని, రోగి బంధువును విజయవాడ తరలించారు. అంబులెన్స్ డ్రైవర్ ను తాడేపల్లిగూడెం తరలించారు