
భైంసా, వెలుగు: ఇటీవల హైదరాబాద్‌లో తనను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తోసేసిన వీడియోను సొంత పార్టీలోని స్థానిక నాయకులు సోషల్‌మీడియాలో షేర్చేస్తూ అవహేళన చేస్తున్నారని, వారి అంతు చూస్తానని బీఆర్ఎస్ నేత, ఏఎంసీ చైర్మన్ రాజేశ్‌బాబు హెచ్చరించారు. సోమవారం బాసర నుంచి భైంసా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి మీడియాతో మాట్లాడారు. మంత్రి తలసాని తనపై దాడి చేస్తే ముథోల్ బీఆర్ఎస్లీడర్లు కనీసం ఖండించకపోవడం దారుణమన్నారు. పైగా ఆ వీడియోను సోషల్‌మీడియాలో షేర్చేయడం తనను మరింత ఆవేదనకు గురి చేసిందన్నారు.
మంత్రి ఐకే రెడ్డి, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలా చారి, ఎమ్మెల్సీ దండే విఠల్మంత్రి తలసానితో బహిరంగ క్షమాపణ చెప్పించారని, నియోజకవర్గ నాయకులు మాత్రం ఇలా చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. అంతకు ముందు బైక్‌ర్యాలీతో బైంసాకు వచ్చిన రాజేశ్‌బాబుకు బీఆర్ఎస్ లీడర్లు సోలాంకి భీంరావు, సౌంవ్లీ రమేశ్ఘన స్వాగతం పలికారు. వెంట తెలంగాణ ఉద్యమకారులు చిన్నారావు, మెండే శ్రీధర్, లక్ష్మణ్ రావు, విజయ్జాదవ్, రాజు పాల్గొన్నారు.