
వైమానిక కోర్సుల్లో అడ్మిషన్లకు ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా విమానయాన రంగంలో లైసెన్స్/ ఇంజినీరింగ్/ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్స్ పొందవచ్చు.
కోర్సులు : లైసెన్స్ ప్రోగ్రామ్: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ (డీజీసీఏ), కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ (ఈఏఎస్ఏ), ఇంజినీరింగ్ ప్రోగ్రామ్: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్: బీబీఏ(ఏవియేషన్), బీఎస్సీ(ఏఎంఈ), సర్టిఫికేట్ ప్రోగ్రామ్: క్యాబిన్ క్రూ, ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్.
అర్హత : కోర్సును అనుసరించి సంబంధిత గ్రూపులో 12వ తరగతి ఉత్తీర్ణత లేదా ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 14 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తలు : అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 31- వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.amecee.in వెబ్సైట్లో సంప్రదించాలి.